ఒకప్పుడు తెల్ల జుట్టు కేవలం ముసలివారికి మాత్రమే వచ్చేది. కానీ ఈ మోడ్రన్ ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు తెల్లబడడం మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ తెల్ల జుట్టు పోగొట్టుకోవడానికి రకరకాల క్రీములు హెయిర్ కలర్స్ వాడుతూ ఉంటారు. వాటిలో కొంతమందికి నచ్చకపోయినా చేసేదేమీ లేక ఆ హెయిర్ క్రీములు వాడుతూ ఉంటారు.అయితే ఇప్పుడు మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా జుట్టు నల్ల పరుచుకోవటానికి కావలసినటువంటి హెయిర్ కలర్ ని తయారు చేయటానికి కొన్ని చిట్కాలను చూద్దాం.
హెన్నా లేదా మెహేంది కలర్:
కావలసిన పదార్థాలు:
సహజ సిద్ధమైన విన్నపౌడర్ 100 నుండి 200 గ్రాములు ఇది జుట్టుకి పొడవును బట్టి తీసుకోవాలి
వేడి నీరు తగినంత తీసుకోవాలి
చక్కెర ఒకటి లేదా రెండు టీ స్పూన్లు (హెన్నా స్మూత్ గా ఉండేందుకు ఉపయోగిస్తారు)
నిమ్మరసం లేదా టి డికర్షను (రంగు మరింత గాఢంగా రావడానికి ఉపయోగించవచ్చు
తయారు చేసే విధానం:
ఒక పాత్రను తీసుకొని హెన్నా పౌడర్ని వేసి వేడి నీటిని బాగా కలపండి. మిశ్రమం మెత్తగా కొంచెం మృదువుగా ఉండేలా చూసుకోండి. చక్కెర నిమ్మరసం లేదా టి డికాషన్ కలపవచ్చు. మిశ్రమాన్ని 6-8 గంటలు నానబెట్టాలి దీనివల్ల రంగు గాఢంగా తయారవుతుంది. జుట్టు సమానంగా డివైడ్ చేసి మిశ్రమాన్ని జుట్టు యొక్క కూతుర్ల నుండి జుట్టు మొత్తం పూర్తిగా కవర్ అయ్యేలా రాయండి రెండు నుంచి నాలుగు గంటలు ఆరనివ్వండి తర్వాత చల్లని నీళ్లతో కడగండి.
గమనిక:
హెన్నా రంగు రెండు నుండి మూడు రోజుల్లో పూర్తిగా సెట్ అవుతుంది. 48 గంటల వరకు షాంపూను వాడకుండా ఉంటే ఫలితం బాగా ఉంటుంది.
గోధుమ రంగు కలర్:
కావలసిన పదార్థాలు:
కాఫీ పౌడర్ రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు
నీరు ఒక కప్పు కండిషనర్ లేదా హెన్నా కలర్ ఎక్కువసేపు ఉండేందుకు
తయారు చేసే విధానం:
కాఫీ పౌడర్ ని నీటిలో బాగా మరిగించి చల్లారనివ్వండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి లేదా కండిషనర్ తో కలిపి జుట్టుకు అప్లై చేయండి. 30-60 నిమిషాల వరకు ఉంచి తర్వాత చల్లటి నీటితో జుట్టును కడగండి.
బీట్రూట్ తో ఎరుపు రంగు కొరకు:
కావలసిన పదార్థాలు:
బీట్రూట్ ఒకటి లేదా రెండు
నీరు ఒక కప్పు హెన్న రంగు ఎక్కువసేపు ఉండేందుకు
తయారు చేయు:
విధానం బీట్రూట్ ని బాగా తురిమి నీటిలో వేసి మరిగించండి. చల్లారిన తర్వాత బాగా వడగట్టండి.ఈ రసాన్ని జుట్టుకు సమానంగా రాయండి లేదా హెన్నతో కలిపి అప్లై చేయొచ్చు. ఒకటి నుండి రెండు గంటలు ఉంచి చల్లటి నీటితో తల స్నానం చేసేయండి.
కెమోమిలే టీతో బంగారు షేడ్ రంగు:
కావాల్సిన పదార్థాలు:
కేమే టీ బ్యాగ్స్ 2-3
నీరు రెండు కప్పులు
తయారు చేయు విధానం:
నీటిలో కెమేమిలే టీ బ్యాగ్స్ వేసి మరిగించండి. తర్వాత చల్లారనివ్వండి ఈ టీ ని జుట్టుకు రాసి 30-60 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లని నీటితో కడగండి
తీసుకోవలసిన జాగ్రత్తలు:
పైన చెప్పినవన్నీ సహజ సిద్ధమైన వస్తువులే కాబట్టి ఎటువంటి హాని ఉండదు. కానీ అప్లై చేసే ముందు చర్మం పై పూర్తిగా రాసి ఏమైనా ఇబ్బందికరంగా ఉందో లేదో గమనించండి. తర్వాత జుట్టుకు అప్లై చేయడం మంచిది.

No comments: