నియంత్రించ తగిన కారణాలు
| నియంత్రించలేని కారణాలు |
అధికంగా ఉప్పు వినియోగము | వయసు పెరగటం |
అధికమైన బరువు లేదా స్థూలకాయం | జన్యుపరమైన సమస్యలు |
మద్యపానము | దీర్ఘకాలిక వ్యాధులు |
వీటిలో ముఖ్యంగా మనం నియంత్రించ గలిగిన కారణాల మీద దృష్టి పెట్టడం ఎంతో అవసరం. ఎందుకంటే అవి మన చేతుల్లో ఉన్నటువంటిది.ఆహారం తీసుకునే సమయంలో లేదా ఆహారం వండే సమయంలో ఉప్పు (salt)తక్కువగా వేసుకోవటం లేదా తక్కువగా తీసుకోవడం చాలా అవసరం. అధికమైన బరువు ఉన్న యెడల బరువును తగ్గించుకోవటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా శారీరక శ్రమ అనేది చాలా అవసరం. మద్యపానము ధూమపానము వంటివి ఏమైనా అలవాటు ఉంటే వీలైనంత త్వరగా మానుకోవడం మంచిది . సమస్యలు అందరికీ ఉంటాయి కాబట్టి ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి ఒత్తిడికి కురికాకుండా చూసుకోవాలి.
అయితే నియంత్రించలేని కారణాలు వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టిఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం వైద్యుని సలహాలు పాటించడం చాలా అవసరం.
అధిక రక్తపోటు లక్షణాలు(Symptoms of High Blood Pressure)
సాధారణంగా హై బీపీ (BP) లేదా అధిక రక్తపోటు(Blood Pressure) చాలా సందర్భాలలో ఎటువంటి లక్షణాలు చూపించదు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. వాటిలో ప్రధానమైనవి.
- తలనొప్పి
- తల తిరుగుతూ ఉండటం
- మైకం కమ్మినట్టు ఉండడం
- కంటిచూపు మసక బారినట్లు ఉండటం
- చెవులలో ఏదో శబ్దం వచ్చినట్టు ఉండటం
- దృష్టి మస్కపోరాటం ఇంకొన్ని లక్షణాలు
- ముక్కునుండి రక్తం
- చాతిలో నొప్పి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం
- ఎక్కువగా అలసిపోవడం
అధిక రక్తపోటు నిర్ధారణ (Diagnosis of High Blood Pressure):
సిస్టోలిక్
| డయాస్ట్రాలిక్ | స్థితి |
<120 | <80 | సాధారణము |
120-129 | <80 | జాగ్రత్త పడవలసిన |
130-139 | 80-90 | స్టేజ్ 1 హైపర్టెన్షన్ |
≥140 | ≥90 | స్టేజ్ 2 హైపర్టెన్షన్
|
హై బీపీ (BP) లేదా అధిక రక్తపోటు(Blood Pressure) నివారించడానికి లేదా తగ్గించుకోవడానికి ఆరోగ్యపరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. కనీస వ్యాయామము, సమతుల్యమైన ఆహారము, ఒత్తిడి తగ్గించుకోవటానికి లేదా ఒత్తిడి నుండి బయటపడటానికి ప్రయత్నించటం. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మన యొక్క బీపీని లేదా రక్తపోటుని అదుపులో ఉంచుకోవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
పై వాటిలో మీకు ఏదైనా లక్షణాలు కనిపించిన లేదంటే అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకొని మీకు రక్తపోటు లేదా బిపి ఉందా లేదా తెలుసుకోవడం ముఖ్యంగా భవిష్యత్తులో బీపీ రక్తపోటు(Blood Pressure) భారి నుండి తప్పించుకోవడం చాలా అవసరం.
No comments: