ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేయొచ్చా? లేదా అనే విషయం గురించి చాలా మందికి అనేక విధాల అపోహలు ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం సురక్షితమా?
సాధారణంగా ఎటువంటి సమస్యలు లేని శృంగారం చేయడం సురక్షితమే. తల్లి గర్భం లో అమ్నియోటిక్ లో బిడ్డ సురక్షితంగా ఉంటుంది. కాబట్టి బిడ్డకు ఎటువంటి హాని ఉండదు.
కానీ, డాక్టర్లు హై రిస్క్ ప్రెగ్నన్సీలో గతంలో రక్తస్రావం జరగడం వంటి సమస్యలు ఉన్నప్పుడు శృంగారం నకు దూరంగా ఉండాలి అని సూచించినప్పుడు శృంగారాన్ని నిలిపివేయాలి.
త్రైమాసికాల వారీగా సలహాలు తెలుసుకుందాం.
1.మొదటి త్రైమాసికం లేదా 1-3 నెలలు
ఈ సమయంలో అలసట వికారం వంటివి ఉండవచ్చు కాబట్టి భాగస్వామి సౌకర్యంగా ఉంది అనిపిస్తే శృంగారంలో పాల్గొనడం మంచిది.
2.రెండవ త్రైమాసికం లేదా 4-6 నెలలు
ఈ సమయంలో శ్రీ కి కొంచెం సెక్స్ సాధారణంగా ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి సెక్స్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది.
3.మూడో త్రైమాసికం లేదా 7-9 నెలలు
ఈ సమయంలో సిరీటం శరీరం బరువు పెరగడం అలాగే పొట్ట పరిమాణం పెరగడం వలన సెక్స్ చేయటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితులలో సౌకర్యవంతమైన సెక్స్ చేయడం ఉత్తమం. అలాగే డెలివరీ సమీపిస్తున్న కొద్ది డాక్టర్ సలహా తీసుకొని శృంగారంలో పాల్గొనడం మంచిది.
డాక్టర్ గారి సలహా ఎప్పుడు తీసుకోవాలి:
ఏవైనా సమస్యలు అంటే రక్తస్రావం, తిమ్మిరిగా అనిపించడం, అసాధారణమైన నొప్పి ,ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది . హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే సెక్స్ కి దూరంగా ఉండమని డాక్టర్లు సలహా ఇవ్వవచ్చు . అలాగే గర్భం పెరుగుతున్న కొద్దీ సౌకర్యవంతమైన పొజిషన్లో శృంగారం చేయడం మంచిది. దీనితోపాటు శుభ్రమైన పరిస్థితులను కూడా చూసుకోవాలి.
ఇన్ఫెక్షన్ నివారించడానికి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అలాగే కండోమ్ వాడటం కూడా ఇన్ఫెక్షన్ లో భారీ నుండి భార్య భర్తలు ఇద్దరిని సంరక్షితుంది.
శృంగారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
భార్యాభర్తలు ఇద్దరూ భావోద్వేగ సానిహిత్యాన్ని కలిగి ఉండేలా చూస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది.రెండవ త్రైమాసికంలో రక్త ప్రసరణ బాగా జరగవచ్చు లేదా మెరుగు పడవచ్చు .కొన్ని సందర్భాలలో చివరి నెలలో శృంగారం చేయడం వలన డెలివరీ సులభంగా అవుతుంది అని కొన్ని అధ్యయనాలు అలాగే కొంతమంది డాక్టర్లు కూడా సూచిస్తూ ఉంటారు.
ముఖ్యమైన సలహా:
ప్రతి స్త్రీ గర్భం దాల్చినపుడు తన శరీరాన్ని బట్టి లేదా గర్భాన్ని బట్టి భిన్నమైన వ్యక్తిత్వం అలాగే శరీర పరిస్థితులు కలిగి ఉంటుంది. కాబట్టి గైనకాలజి నిపుణులతో తో సంప్రదించి మీ పరిస్థితులకు సరిపడే సలహాలు తీసుకోండి. అలాగే భాగస్వాముల మధ్య చక్కని ప్రేమ అనురాగాలు కలిగి ఉండేలా చూసుకోండి.

No comments: