ఇక ఆధార్ కార్డు అవసరం లేనట్లేనా?
మన దేశంలో ప్రతి ఒక్కరికీ సాధారణమైన గుర్తింపు కోసం ఆధార్ ను ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రతి ఒక్కరికీ గుర్తింపు కావాలంటే మొదటగా గుర్తుకొచ్చేది ఆధార్ మాత్రమే. ఎక్కడ ఏ పథకం కావాలన్నా ఏ పని కావాలన్నా మొదటగా గుర్తొచ్చేది ఆధార్ మాత్రమే. ప్రభుత్వ పథకాలకైనా ప్రైవేట్ గుర్తింపుకైనా ఆధార్కున్న ప్రాముఖ్యత చెప్పాల్సిన పనిలేదు. అటువంటి ఆధార్‌కు సంబంధించిన. కీలకమైన అప్డేట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది.
ఆధార్ ని. 8 జనవరి 2019 న భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారతీయులకు అందరికీ ఒక గుర్తింపు తీసుకురావడం. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) నిర్వహిస్తుంది.
మొట్టమొదటి ఆధార్ 1, సెప్టెంబర్ 2010 న మహారాష్ట్రలోని ఒక ప్రాంతంలో జారీ చేశారు. దీని తర్వాత దేశ వ్యాప్తంగా ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆధార్‌లో. 12 అంకెల గుర్తింపు నంబర్ ఉంటుంది. ఇది బయోమెట్రిక్ మరియు జనసంఖ్యా డేటా ఆధారంగా. నిర్వహించబడుతుంది.
ఎక్కడైనా ఆధార్ సంబంధించి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు. లాగా ఆధార్ చూపించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎవరైనా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురాలేకపోతే. వారికి కావాల్సిన పని జరిగేది కాదు. అటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ను రిలీస్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం డేటా ప్రైవసీని రక్షించడం వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా సులభంగా మార్చడం. ఈ యాప్ ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) సహకారంతో అభివృద్ధి చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఈ కొత్త యాప్ గురించి కేంద్ర సహకార సాంకేతిక మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X లో ఒక డెమో వీడియోను పోస్ట్ చేశారు. యాప్ ఎలా పని చేస్తుంది? దాని ఉపయోగాల గురించి వివరించారు.

No comments: